భారంగా ‘వజ్ర’.. వదిలించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం!

-

హైదరాబాద్: ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింత చేరువచేసుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి ఆదరణ కరువైంది. ప్రయాణికులను ఇంటి దగ్గరనుంచే గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్ ఆర్టీసీ ‘వజ్ర ’ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో తిప్పారు. 21 సీట్లతో మొత్తం 100 బస్సులను ఈ రూట్లలో నడిపారు. అయితే వీటి సేవలను ప్రజలు పెద్ద వినియోగించుకులేదు. ఛార్జీలు విపరీతంగా ఉండటంతో  సాధారణ ఆర్టీసీ బస్సుల వైపే మొగ్గు చూపారు. అటు కరోనా ఎఫెక్ట్ కూడా ఈ బస్సులపై భారీగా పడింది.

కరోనా కాలంలో లాక్ డౌన్‌తో చాలా బస్సులు షెడ్డుకే పరిమితమయ్యాయి. వాటితో పాటు ఈ వజ్ర బస్సులు కూడా షెడ్డుల్లో ఉండిపోయాయి. దీంతో వీటి నిర్వహణ భారంగా మారింది. చాలా రోజులుగా బస్సులు నడవకపోవడంతో బస్సుల్లో రిపేర్లు వచ్చాయి. అంతే ఈ బస్సులను వదిలించుకోవాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించుకుంది. ఈ బస్సులకు వేలం నిర్వహించాలని యోచిస్తోంది. స్క్రాప్ విభాగం ద్వారా వీటి విలువను అంచనా వేశారు. బహిరంగ వేలం వేసేందుకు టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. మూడు నెలల్లో ఈ బస్సులను అమ్మేందుకు ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version