తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం వీలైనన్న రకాలుగా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు వెతుకుతున్నాయి. ఇప్పటికే పార్శిల్ సేవలు, స్లీపర్ బస్సులు, వివిధ ఆఫర్లతో ఆదాయా మార్గాలు వెతికిన టీఎస్ఆర్టీసీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశా రాష్ట్రానికి రాకపోకలు సాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓఎస్ఆర్టీసీతో ఒప్పందం టీఎస్ఆర్టీసీ కుదుర్చుకుంది.
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాచలం నుంచి ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడిపేలా టీఎస్ఆర్టీసీ, ఓఎస్ఆర్టీసీల మధ్య ఒప్పందం జరిగింది. దీని ప్రకారం.. టీఎస్ఆర్టీసీ 10 బస్సులను ఒడిశాకు.. ఓఎస్ఆర్టీసీ 13 సర్వీస్‌లను తెలంగాణకు నడపనున్నాయి.
ఇందులో హైదరాబాద్-జయపుర మధ్య రెండు, ఖమ్మం-రాయగడ రెండు, భవానీపట్న-విజయవాడ (వయా భద్రాచలం) రెండు, భద్రాచలం-జయపుర మధ్య నాలుగు సర్వీసులను టీఎస్ఆర్టీసీ నడపనుంది. నవరంగ్‌పూర్-హైదరాబాద్ మధ్య నాలుగు, జయపుర-హైదరాబాద్ రెండు, భవానిపట్న-విజయవాడ(వయా భద్రాచలం) రెండు, రాయగడ-కరీంనగర్ రెండు, జయపుర-భద్రాచలం మధ్య మూడు సర్వీసులను ఓఎస్ఆర్టీసీ నడపనుంది.