TTD :ఫిబ్రవరి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు..

-

AP: కలియుగ ప్రత్యక్షదైవం,కొలిచినవారి కొంగుబంగారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతీ రోజూ విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు . జనవరి నెల ముగింపునకు వస్తుండడంతో త్వరలోనే ఫిబ్రవరి నెల మొదలు కానుంది.. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్రవ‌రి నెల‌లో జ‌రుగ‌నున్న విశేష పర్వదినాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ప్రకటించింది.

ఫిబ్రవరి నెలలో జరిగే విశేష పర్వదినాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి..

ఫిబ్రవరి 9న శ్రీపురందరదాసుల ఆరాధనోత్సవం, 10న తిరుకచ్చినంబి ఉత్సవం, 14న వసంతపంచమి, 16న రథసప్తమి, 19న తిరుకచ్చినంబి శాత్తుమొర, 20న భీష్మ ఏకాదశి, 21న కులశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 24న కుమారధార తీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ.

Read more RELATED
Recommended to you

Latest news