టీటీడీ ఉద్యోగస్తులకు శుభవార్త… భూమన కరుణాకర్ రెడ్డి కీలక నిర్ణయం !

-

ఈ మధ్యనే టీటీడీ కొత్త చైర్మన్ గా ఎంపిక అయిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాలనలో తనకంటూ ఒక పంథాను సృష్టించుకుని పనిలో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. భక్తులకు మరియు ఉద్యోగస్తులకు మంచి చేయాలన్న భావనతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం భూమన ఒక కీలక నిర్ణయం తీసుకుని ఉద్యోగస్తులకు శుభవార్తను అందించాడు. టీటీడీ పారిశుధ్య కార్మికులకు ఇంతకు ముందు వరకు నెలకు రూ. 12 వేలు జీతం ఇస్తున్నారు.. కానీ ఈ జీతం ఇప్పుడు ఏకంగా అయిదు వేలు పెంచుతూ టీటీడీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నాడు. అదే విధంగా టీటీడీ పరిధిలో పనిచేస్తున్న కార్పొరేషన్ ఉద్యోగుల జీతాలను ఇకపై ప్రతి సంవత్సరం 3 శాతం పెంచడానికి పూనుకున్నాడు.

ఏదైనా కారణంగా ఈ ఉద్యోగులు అకాల మరణం చెందితే రూ.2 లక్షల పరిహారం అందించడానికి భూమన ఓకే చెప్పడం జరిగింది. ఇక ఇప్పటి వరకు చూస్తే ఈఎస్ఐ కొందరికి మాత్రమే వర్తిస్తూ వచ్చింది.. ఇది వర్తించని ఉద్యోగులకు హెల్త్ స్కీం ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version