Breaking : శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. టీటీడీ టికెట్లు విడుదల

-

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. బుధవారం ఉదయం 9 గంటలకు నవంబర్‌ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. అదేవిధంగా నవంబర్‌ నెలకు కోటాకు చెందిన కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, ఊంజల్‌ సేవ, ఆర్జిత సేవా టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.

మొదట వచ్చినవారికి మొదట కేటాయింపు ప్రాతిపదికన టికెట్లను జారీచేయనున్నారు. ఇక ఆర్జిత సేవల లక్కీడిప్‌ రిజిస్ట్రేషన్లు నేడు అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు అక్టోబర్‌ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టికెట్లను టీటీడీ గురువారం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version