ఆదివారం అందరూ ఇంటిదగ్గరే ఉంటారనే ఉద్దేశంతో తొలిసారిగా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవనంలో ఈ రోజున డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించిన టీటీడీ ఆలయ ఈవో అనిల్ కుమార్ సింగాల్ భక్తులతో చాలా సేపు మాట్లాడారు. అలాగే టీటీడీ ఆస్తులకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులపై అనేక వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. టీటీడీ కి సంబంధించిన ఆస్తులను పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత శ్వేతపత్రం విడుదల చేస్తామని… ఫలితంగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పోతుందని అనిల్ కుమార్ సింఘాల్ చెప్పుకొచ్చారు.
ఇదే సందర్భంగా ఆయన ఇంకా మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టి శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లకు టెండర్లు నిర్వహిస్తున్నామని కూడా చెప్పారు. అలాగే సెప్టెంబర్ నెల వరకు టీటీడీకి ఎటువంటి ఆర్థిక పరమైన సమస్యలు లేవని స్పష్టం చేశారు.