తిరుమల టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు దేశవ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటి ఏర్పాటు చేస్తున్నట్లు ఇఓ శ్యామలరావు తెలిపారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తాం. తిరుమల పర్యటనలో భక్తుల ఆరోగ్య సమస్యలు గుర్తించి….సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తాం. భక్తులకు అందించే సేవల పై ఫిడ్ బ్యాక్ ఏపి డిజిటల్ సహకారంతో స్వీకరించేందుకు నిర్ణయం తీసుకున్నం.
తిరుమలలో ఉన్న హోటల్స్ టెండర్ల కేటాయింపులో కూడా మార్పులు చేస్తాం. అన్నప్రసాదంలో అదనంగా 258 సిబ్బంది నియామకం ఉంటుంది. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాల నిర్వహణ కి 2 కోట్లు కేటాయించాము. పుడ్ సేప్టి విభాగాన్ని నియమించాలని నిర్ణయం తీసుకున్నం. భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్స్ వద్ద 3.6 కోట్ల రూపాయలతో టాయిలెట్స్ నిర్మాణం జరుగుతుంది. ఒంటిమిట్ట రామాలయం లో 42 లక్షల బంగారు కలశం ఏర్పాటు చేస్తాం. శారదా పీఠానికి కేటాయించిన మఠం లీజు రద్దు చెయ్యడానికి నోటీసులు జారి చేసాం.. వారి సమాధానం పై తదుపరి చర్యలు ఉంటాయి అని ఇఓ శ్యామలరావు అన్నారు.