కరోనా వైరస్ నివారణకు గాను ఎవరి వంతు సాయం వాళ్ళు చేస్తున్నారు. ప్రజలకు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి గాను తమ వంతుగా యాప్స్ తయారు చేయడం ఆరోగ్య చిట్కాలు చెప్పడం వంటివి చేస్తూ వస్తున్నారు. ఆర్ధిక స్తోమత ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఇలా ఎవరికి వారు సహాయం చేస్తున్నారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకి వచ్చింది.
కరోనా నివరానకు గాను తమ వంతుగా ఒక సాయం చేసింది. ఆయుర్వేద ఔషధం అందించడానికి చర్యలు చేపట్టింది. దీని ద్వారా కరోనా ను కట్టడి చేయవచ్చు అని భావిస్తుంది. తితిదే ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్షజ్ఞ ధూపం(క్రిమిసంహారక ధూపం), పవిత్ర (చేతులు శుభ్రం చేసుకోవడానికి వాడే ద్రావకం), గండూషము( నోట్లో పుక్కిలించే మందు), నింబనస్యము (ముక్కులో వేసుకునే చుక్కల మందు).
అమృత (వ్యాధి నిరోధక శక్తి పెంచే మాత్ర)లను తయారు చేయడం విశేషం. వీటిని తాజాగా విడుదల చేసారు. తితిదే తిరుపతి జేఈవో పి.బసంత్‌కుమార్ వీటిని విడుదల చేసారు. కరోనా నివారణకు ఇవి చాలా ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. వీటిని ప్రజలు వాడితే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.