భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ సీరీస్… కోహ్లీ సెంచరీ చేస్తే మాకు హ్యాపీ; అక్తర్

-

భారత్ పాకిస్తాన్ సీరీస్ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే దేశం మీద ఉగ్రవాద దాడులు పాకిస్తాన్ చేస్తున్న నేపధ్యంలో 2007 తర్వాత పూర్తి స్థాయి సీరీస్ రెండు దేశాల మధ్య జరిగిన సందర్భం లేదు. ఏదైనా ఐసిసి టోర్నీ లేదా ఆసియా కప్ లో మినహా రెండు దేశాలు ఆడటం లేదు. ఈ తరుణంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ కీలక ప్రకటన చేసాడు.

“ఈ సంక్షోభ సమయంలో, నేను మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రతిపాదించాలనుకుంటున్నా అని అన్నాడు. సాధారణంగా భారత్ పాక్ మధ్య మ్యాచ్ అంటే ఎవరు గెలుస్తారు అనే ఉత్సాహం ఉంటుంది. కాని ఈసారి అలాంటిది ఏమీ ఉండదు అని ధీమా వ్యక్తం చేసాడు అక్తర్. ప్రజలు ఫలితం గురించి అంత ఆసక్తి చూపించే అవకాశం ఉండదని పేర్కొన్నాడు. విరాట్ సెంచరి చేస్తే మేము సంతోషంగా ఉంటామని చెప్పిన అక్తర్…

బాబర్ ఆజం సెంచరి చేస్తే మీరు సంతోషంగా ఉంటారు… మైదానంలో ఏమి జరిగినా ఇరు జట్లు విజేతలు అవుతాయని పేర్కొన్నాడు. ఈ మూడు మ్యాచులను ప్రేక్షకులు బాగా వీక్షిస్తారని… మొదటి సారి రెండు దేశాలు ఒక దేశం కోసం మరో దేశం ఆడతాయని దీని ద్వారా ఏ నిధులు వచ్చినా సరే ఈ మహమ్మారిపై పోరాటం చేయడానికి భారత్, పాక్ ప్రభుత్వాలకు సమానంగా విరాళం ఇవ్వొచ్చని అక్తర్ పేర్కొన్నాడు.

పరిస్థితి మెరుగు పడిన తర్వాత ఈ మ్యాచ్ లను నిర్వహించాలని సూచించాడు. ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ఇంట్లో కూర్చున్నారు, కాబట్టి మ్యాచ్ లకు భారీ ఫాలోయింగ్ ఉంటుందని అన్నాడు. ఇందుకోసం దుబాయ్ లో మ్యాచులను ఏర్పాటు చేసుకోవచ్చని చార్టెడ్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించాడు. ప్రపంచం మొత్తం దీన్ని చూస్తుంది కాబట్టి భారీగా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుందని అన్నాడు. అలాగే క్రికెట్ సంబంధాలు మెరుగు పడటమే కాకుండా ఇరు దేశాల సంబంధాలు మెరుగు పడతాయని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version