శ్రీవారి భక్తులకు అలర్ట్‌… రేపు ఆర్జిత సేవ టికెట్లు

-

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్తం చెప్పింది. జనవరి నెల‌ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవల ఆన్‌లైన్ లక్కీడిప్ కోసం బుధవారం (18న) ఉదయం 10 గంటల నుంచి.. 20న ఉదయం 10 గంటల వరకు పోన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు.. 22న మధ్యాహ్నం 12 గంటల్లోగా రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే కల్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను 21న ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. వర్చువల్‌ సేవా టికెట్లను 21న మధ్యాహ్నం 3గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

ఇక శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం, గదుల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నంది. వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం టికెట్ల కోటాను అక్టోబర్‌ 23 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు వివరించింది. అలాగే తిరుమల, తిరుపతి వసతి గదుల బుకింగ్‌ను 25న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పింది. 27న ఉదయం 10 గంటలకు తిరుపతికి చెందిన శ్రీవారి కోటాను, ఉదయం 12 గంటలకు నవనీత సేవ కోటాను, 3 గంటలకు పరామణి సేవ కోటా టికెట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్‌ చేసుకొని.. సహకరించాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version