ఈ నెల 20నుంచి ప్రారంభంకానున్న తుంగభద్ర పుష్కరాలు..!

-

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే తుంగభద్ర పుష్కరాలు వచ్చేశాయి. 2008లో జరిగిన ఈ పుష్కరాలు మళ్లీ ఈ ఏడాదీలో జరగనున్నాయి. తుంగభద్ర పుష్కారాలకు మూహార్తం వచ్చేసింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం1.21 గంటలకు శుభముహార్తంగా నిర్ణయించినట్లు దేవాదాయా శాఖ నిర్ణయించింది. అర్చక టైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన దైవజ్ఞ సమ్మేళనంలో పంచాంగకర్తలు ఈ ముహుర్తాన్ని నిర్ణయించి అనుమతికోసం ప్రభుత్వానికి పంపటం జరిగింది. అధికారులు అంగీకరించి ముహర్తతేదీని విడుదల చేశారు. ఈ నెల20వ తేదీ నుంచి డిసెంబరు1వ తేదీ వరకు 12రోజుల పాటు పుష్కరాలు జరుగుతాయి..

TUNGABHAD

తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 23 పుష్కర ఘాట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా ఈసారి నదీ స్నానాలకు బదులుగా భక్తులు జల్లు సాన్నాలు చేయాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా ఆ మేరకు ఘాట్ల వద్ద అధికార యంత్రాంగం స్ప్రింకర్లను ఏర్పాటు చేస్తోంది. పుష్కరాల సందర్భంగా పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేందుకు మొత్తం 443 మంది పురోహితులను ఎంపిక చేసి, వారికి గుర్తింపు కార్డులను అందజేసింది.

ఘాట్లకు సమీపంలోని ఆలయాల్లో దర్శనాలకు ఇబ్బంది లేకుండా అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా దేవదాయ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా విధుల్లో నియమించారు. ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులతో స్పెషల్ కమీషనర్ అర్జునరావు వీడియోకాన్పరెన్స్ నిర్వహించి సూచనలు చేశారు. కోవిడ్ వ్యాప్తిచెందకుండా మాస్కులు,శానిటైజర్లు అందుబాటులో ఉంచుతూ.. భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. తుంగభద్ర పుష్కరాల్లో మొదటిరోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. కర్నూలు జిల్లాలోని సంకల్‌బాగ్‌ పుష్కర ఘాట్‌ వద్ద శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొంటారు. కార్తీక మాసంలో వచ్చిన ఈ పుష్కరాలకు విశిష్టత ఉండటంతో కరోనా కారణంగా ప్రజలు రావటానికి మొగ్గు చూపుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version