ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను కొందరు అక్రమార్కులు ధ్వంసం చేస్తున్నారు. నీరు, గాలి, మట్టి ఇలా దేనిని వదలడం లేదు. డబ్బు మాయలో పడి ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తిలో కొందరు ఇసుక బకాసురులు ఇష్టానుసారంగా తోడేస్తున్నారు. లారీల్లో తరలించి అమ్ముకుని డబ్బులు దండుకుంటున్నారు.
జోరుగా సాగుతున్న అక్రమ ఇసుక దందాపై అధికారుల నిఘా కరువైంది. జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం-వంగమర్తి వాగులో జోరుగా ఇసుకను తవ్వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్లతో రాత్రి, పగలు అక్రమంగా ఇసుక మాఫియా ఇసుకను తరలిస్తోంది. ఈ క్రమంలోనే ఇసుకను తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. లారీ డ్రైవర్లతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేసినట్లు తెలుస్తోంది.
తుంగతుర్తిలో జోరుగా సాగుతున్న అక్రమ ఇసుక దందా
నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం – వంగమర్తి వాగు నుంచి సాగుతున్న ఇసుక మాఫియా
ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్లతో రాత్రి, పగలు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక మాఫియా
ఇసుకను తరలిస్తుండగా అడ్డుకున్న స్థానికులు pic.twitter.com/OER89pwZcn
— Telugu Scribe (@TeluguScribe) January 9, 2025