నేను క్షేమంగా ఉన్నాను.. ప్రభాకర్.!

-

క‌రోనా వైర‌స్ కార‌ణంగా గ‌త రెండున్నర నెల‌లుగా సినీ ఇండ‌స్ట్రీలో, టీవీ రంగంలో ఎలాంటి షూటింగ్‌లు జ‌ర‌గ‌లేదు. అయితే లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఈ మధ్యనే షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. దీంతో తెలుగు సినిమా పరిశ్రమలో కరోనా కలకలం మొదలైంది. ‘సూర్యకాంతం’, ‘మట్టి గాజులు’సీరియల్ నటుడు ప్రభాకర్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ప్రభాకర్ ను ఆసుపత్రికి తరలించి, ఆయన కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు అధికారులు.

అయితే ఇక్కడే చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఓ ప్రభాకర్ కు కరోనా సోకింది. మరో ప్రభాకర్ కు పరామర్శల పర్వం మొదలైంది. సీరియల్స్ లో నటించే బొడ్డు ప్రభాకర్ అనే ఆర్టిస్టుకు కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ అందరూ బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ పొడకండ్ల అని అనుకున్నారు. దీంతో తను సేఫ్ గానే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది ప్రభాకర్. మరోవైపు బొడ్డు ప్రభాకర్ కు కరోనా సోకడంతో టీవీ సీరియల్స్ షూటింగ్స్ అన్నీ డైలమాలో పడ్డాయి. ఈరోజు నుంచి నటీనటులు ఎవ్వరూ షూటింగ్స్ లో పాల్గొనవద్దని తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆదేశాలు జారీచేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version