ఆస్తుల్లో అయోధ్య రామిరెడ్డి టాప్‌..!

-

కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో ఆత్యంత ఎక్కువ ఆస్తులు కలిగిన తొలి ఇద్దరూ వైసీపీకి చెందినవారే. వైసీపీ నుంచి ఎన్నికైన కార్పొరేట్‌ ప్రముఖుడు పరిమల్‌ నత్వాని కంటే కూడా మరో ఎంపీ ఆళ్ల అయోధ్యరామి రెడ్డి ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి. రూ. 2,577 కోట్ల విలువైన ఆస్తులతో  అయోధ్యరామిరెడ్డి తొలిస్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో రూ. 396 కోట్ల విలువైన ఆస్తులతో పరిమల్‌ నత్వానీ నిలిచారు. ఇక రూ. 379 కోట్ల విలువైన ఆస్తులతో బీజేపీ నుంచి ఎన్నికైన జ్యోతిరాధిత్య సింథియా మూడోస్థానంలో ఉన్నారు. ఈ మేరకు రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 65 సభ్యులు ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లను అధ్యయనం చేసి ఏడీఆర్‌ సంస్థ నివేదిక రూపొందించింది.  వైసీపీ నుంచి ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ ఆస్తుల విలువ రూ.4 కోట్లు ఉండగా… మరో సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆస్తుల విలువ కేవలం రూ. 32 లక్షలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version