జనసేన నేత కిరణ్ రాయల్,లక్ష్మి రెడ్డిల మధ్య వివాదం ముగిసింది. తాజాగా మీడియాతో లక్ష్మి రెడ్డి మాట్లాడుతూ… కిరణ్ రాయల్ లో ఆర్థిక లావాదేవీలు సర్దుబాటు చేసుకుంటున్నామన్నారు. నా కుటుంబ సమస్యలు వల్లే బయటకు వచ్చానని…. కానీ రాజకీయ పార్టీలు నన్ను వాడుకున్నాయని ఫైర్ అయ్యారు. జన సేన పార్టీ నేతలే డబ్బులు ఇప్పిస్తామని నా దగ్గర వీడియోలు తీసుకున్నారు… వారి నుంచే ఇవి బయటకు వచ్చాయని బాంబ్ పేల్చారు.
వీడియోల్లో ఏమి మార్పులు చేసి బయటకు వదిలారో నాకు తెలియదని… జన సేన పార్టీ జిల్లా అధ్యక్షుడు హస్తం ఇందులో ఉందని ఆరోపణలు చేశారు. రెండు పార్టీల వాళ్ళు ట్రోల్స్ చేసుకున్నారని మండిపడ్డారు. నా సమస్యను వేరే వాళ్లు రాజకీయం కోసం వాడుకున్నారని… దీంతో నాకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఒక్క వీడియో తప్ప మిగతావి నేను విడుదల చేయలేదని వివరించారు. కొన్ని పాత వీడియోలు బయటకు వచ్చాయి.. వీటితో నాకు సంబంధం లేదని స్పష్టం చేశారు.