గత ప్రభుత్వ హయాంలో టీటీడీ రమణ దీక్షితులు మీద వేసిన పరువు నష్టం దావా కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అదేంటంటే లోక్ అదాలత్ ద్వారా కేసును పరిష్కారం చేసుకునే యోచనలో టీటీడీ ఉందని అంటున్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసు ఉపసంహరణ చేసుకుంటే టీటీడీ చెల్లించిన రెండు కోట్లు వెనక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి గత పాలకమండలి హయంలో 100 కోట్లు పరువు నష్టం కేసు వేసింది టీటీడీ.
పరువు నష్టం కేసును వెనక్కి తీసుకోవాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో తీర్మానం చేసింది పాలకమండలి. అందుకు అనుగుణంగా మార్చిలో కోర్టులో ఉపసంహరణ పిటిషన్ కూడా వేసింది టీటీడీ. అయితే అలా ఉపసంహరణ పిటిషన్ వేస్తే కోర్టుకు టీటీడీ చెల్లించిన రెండు కోట్లు వెనక్కి వచ్చే అవకాశం లేకపోవడంతో టీటీడీ పై విమర్శలు వస్తాయని కేసును ఉపసంహరించుకోవాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గుతు కోర్టులో మెమో దాఖలు చేసింది. 23వ తేదీకి కేసును జడ్జి వాయిదా వేశారు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునేలా ట్రై చేస్తున్నట్లు చెబుతున్నారు.