అమెరికాలో అధికార మార్పిడికి సమయం దగ్గరపడుతున్న కొద్ది అధ్యక్షుడు ట్రంప్ మరియు అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయో చేస్తున్న వివాదాస్పాద వ్యాఖ్యలు ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెంచుతున్నాయి..ఇటీవలే కాలంలో ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై విశ్లేషిస్తే పదవి నుంచి దిగిపోయే లోపు అంతర్జాతీయంగా అనేక సమస్యలను పుట్టించేలా ఉన్నట్లు తెలుస్తుంది.ముఖ్యంగా ట్రంప్, మైక్ పాంపీయో ప్రకటనలతో అగ్ర దేశాలపై అమెరికా-చైనా మధ్య మరింత టెన్షన్ వాతారణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి..ఇటీవలె అమెరికాలోని చైనా కంపెనీలకు చైనా మిలటరీతో సంబంధాలు ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని తో సంబంధాలు ఉన్న జాబితా చేయబడిన 31 చైనా కంపెనీలలో దేనిలోనైనా అమెరికన్ కంపెనీలు మరియు వ్యక్తులు వాటాలను కలిగి ఉండకుండా నిషేధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం సంతకం చేసినట్లు యుఎస్ మీడియా తెలిపింది..అదే రోజు, విదేశాంగ శాఖ యుఎస్ మీడియాతో అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయో ఇచ్చిన ఇంటర్వ్యూను విడుదల చేసింది, దీనిలో యూఎస్ అత్యున్నత దౌత్యవేత్త అయినా తైవాన్ చైనాలో భాగం కాలేదు అని అన్నారు..ఈ కదలికలన్నింటినీ చైనా క్షూణంగా పరీశీలిస్తుంది.. ట్రంప్ మరియు అతని సహచరులు, ముఖ్యంగా పాంపీయో, చైనా-యుఎస్ సంబంధాలను మరింత విషపూరితం చేయడానికి చివరి ప్రయత్నం చేస్తున్నారని..బిడెన్‌పై అంతర్జాతీయంగా మరింత పెంచాలని ట్రంప్ సహచరులు ప్రయత్నిస్తున్నారంటున్నారు విశ్లేషకులు.
రెండో సారి అమెరికా అధ్యక్షుడు కావాలన్న ట్రంప్ కోరికా నేరవేరకపోవడంతో చైనా యూఎస్ మధ్య విభేదాలు పెంచాలని…ఈ వైపు ఒత్తిడిని వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది..అధ్యక్ష ఎన్నికలలో జో బిడెన్‌ను విజేతగా ప్రకటించబడినడంతో పదవిలో రాబోతున్న బిడైన్‌కు చాలా రకాల ఒత్తిడి తెచ్చిపెట్టాలని ట్రంప్ పరిపాలన యంత్రం ప్రణాళికలు వేస్తుంది.
తైవాన్ విషయంలో పాంపీయో మాటలు చైనా పట్ల అమెరికా దౌత్య నిబద్ధతకు విరుద్ధంగా ఉన్నాయని, దౌత్యపంగా మరింత సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇరు దేశాలు ఎకీభవంతో ఉన్న సమయంలో పాంపీయో వ్యాఖ్యలు రెచ్చగెట్టేలా ఉన్నాయంటున్నారు..అతను కోరుకుంటున్నది బహుశా తనకు మరియు ట్రంప్ పరిపాలనకు చైనా వ్యతిరేక ఇమేజ్ను బలోపేతం చేయడమే అన్నారు..చైనా-యుఎస్ సంబంధాలపై కొత్త పరిపాలనకు కొంత ఇబ్బంది కలిగించడం రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అమెరికా దౌత్యవేత్త ఒక-చైనా సూత్రాన్ని నిర్మొహమాటంగా సవాలు చేయడం చాలా బాధకరం..ఎక్కువ మంది అమెరికా సీనియర్ అధికారులు అతని వ్యాఖ్యలకు ప్రభావితం అయితే రెండు దేశాల మధ్య తీవ్ర పరిణామాలకు దారితీస్తుందంటున్నారు..ట్రంప్ మరియు పోంపీలు పదవిలో ఉండటానికి 70 రోజుల కన్నా తక్కువ సమయం ఉంది..వారు చైనా-యుఎస్ సంబంధాలను విషపూరితం చేస్తున్నారు.
శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ, పాంపీ యొక్క వ్యాఖ్యలు తన రాజకీయ ప్రయోజనాలను తీర్చగలవు కాని.. ప్రజల అభిప్రాయాలను తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని, చైనా-యూఎస్ సంబంధాలను మరింత అణగదొక్కడంతో రెండు దేశాల మధ్య స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని అన్నారు..చైనా తన ప్రయోజనాలను దెబ్బతీసే పాంపీయో వంటి వ్యక్తులతో పోరాడుతుందని..దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని చైనా ప్రతినధి హెచ్చరించారు..మరోవైపు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం జో బిడెన్ మరియు కమలా హారిస్‌లకు దేశ అభినందనలు తెలియజేసింది..అమెరికన్ ప్రజల తీర్పును చైనా గౌరవిస్తుందని అన్నారు.. పాంపీయో వ్యాఖ్యల తరువాత బిడెన్కు అభినందనలు తెలపడంతో చైనా అమెరికా మధ్య కోల్డ్ వార్ ఉన్నప్పటికీ..అమెరికాతో మంచి సంబంధాలను చైనా కొరుకున్నట్లు బిడెన్కుఈ సిగ్నల్ పంపడం ద్వారా తెలుస్తుంది..వచ్చే రెండు నెలాల్లో అంతర్జాతీయంగా మరిన్ని మార్పులు వచ్చు అవకాశాలు ఉన్నాయి..ట్రంప్ ,పాంపియో వ్యాఖ్యలతో సరిహద్దులు కలిగిన దేశాల మధ్య దాయాది పోరు మరింత ఉద్రిక్తం అయ్యేప్రమాదం ఉంది..ట్రంప్ వచ్చే 60 రోజుల్లో తీసుకునే నిర్ణయాలపై కొత్త అధ్యక్షుడు బిడైన్ యొక్క అంతర్జాతీయ సంబంధాలు అధారపడి ఉంటాయంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు.