కమలంలో కొత్త ట్విస్ట్.. కారుకు బ్రేకులు!

-

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడానికి బీజేపీ గట్టిగానే ట్రై చేస్తుంది…మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా చేసేందుకు బీజేపీ దూకుడుగా రాజకీయం చేస్తుంది. అలాగే తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని కమలదళం పనిచేస్తుంది. ఈ క్రమంలో బీజేపీ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తుంది…ప్రతి అంశంలోనూ కారు పార్టీకి బ్రేకులు వేయడమే లక్ష్యంగా వెళుతుంది.

కేంద్ర పెద్దలు కూడా తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి పనిచేస్తుంది..రాష్ట్ర నేతలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పనిచేయిస్తుంది. టోటల్‌గా కేసీఆర్‌ని అష్టదిగ్బంధనం చేయడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. అటు కేసీఆర్ సైతం బీజేపీని టార్గెట్ చేసి రాజకీయం నడిపిస్తున్నారు. తెలంగాణలో కాదు కేంద్రంలో కూడా బీజేపీకి చెక్ పెట్టాలని రాజకీయం నడిపిస్తున్నారు. బీజేపీ ఎత్తులకు కేసీఆర్ పై ఎత్తు వేస్తున్నారు. అలా అని బీజేపీ సైలెంట్‌గా ఉండటం లేదు. కేసీఆర్‌ని మించేలా వ్యూహాలు రచిస్తుంది. ఇలా తెలంగాణ పార్టీలో రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తుంది.

ఈ యుద్ధంలో పై చేయి సాధించేందుకు రెండు పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకెళుతుంది. అయితే రాష్ట్రంలో బీజేపీ బలాన్ని మరింత పెంచేలా కారు స్పీడుకు బ్రేకులు పడేలా కేంద్ర పెద్దలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా తెలంగాణ బీజేపీలో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. బీజేపీ బలోపేతానికి సరికొత్త నాయకులు రంగంలోకి దిగనున్నారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా తరుణ్ ఛుగ్ ఉన్న విషయం తెలిసిందే…ఈయనకు తోడుగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగత కార్యక్రమాల ఇంచార్జ్‌గా సునీల్ బన్సాల్‌ని నియమించారు. ఇక తాజాగా వీరికి తోడుగా పార్టీ జాతీయ కార్యదర్శి, సీనియర్‌ నేత, కేరళకు చెందిన అర్వింద్‌ మీనన్‌కు సహ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. తెలంగాణకు బీజేపీ అధిష్ఠానం ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తోందో ఈ నియమకాలు బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఎలాగైనా తెలంగాణలో గెలవాలనే లక్ష్యంతో బీజేపీ ఇలా కొత్త వ్యూహాలతో ముందుకొస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version