ఓటుకు నోటు కేసులో ట్విస్ట్ : సుప్రీంకోర్టుకు ఎమ్మెల్యే సండ్ర

-

ఢిల్లీ : ఓటుకు నోటు కేసు నుంచి త‌న పేరు తొల‌గిం చాల‌ని సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌. అటు ఈ కేసుకు అవినీతి నిరోధ‌క చ‌ట్టం వ‌ర్తించద‌ని, సాక్షుల క్రాస్ ఎగ్జామినేష‌న్ పూర్త‌య్యే వ‌ర‌కు విచార‌ణ చేప‌ట్ట‌ వ‌ద్ద‌ని వేర్వురుగా పిటిష‌న్లు దాఖ‌లు చేసారు ఎంపీ రేవంత్ రెడ్డి.. ఇక పిటిష‌న్ల‌ను జ‌స్టిస్ వినీత్ శ‌ర‌ణ్‌, జ‌స్టిస్ దినేష్ మ‌హేశ్వ‌రి ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచారించింది.

తెలంగాణ ప్రభుత్వానికి అఫిడ‌విట్ దాఖ‌లు చేసేందుకు సెప్టెంబ‌రు 31 వ‌ర‌కు గ‌డువు ఇచ్చింది ధ‌ర్మాస‌నం. కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లుకు సండ్ర‌వెంకట వీరయ్యకు, రేవంత్‌రెడ్డిల‌కు సెప్టెంబ‌రు 6 వ‌ర‌కు గ‌డువు ఇచ్చింది ధ‌ర్మాస‌నం. ఇక ఈ కేసు త‌దుప‌రి విచార‌ణను సెప్టెంబ‌రు 7వతేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్ట్ ధ‌ర్మాస‌నం. కాగా ఓటుకు నోటు కేసులో… ముద్దాయిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ కేసు అనంతరం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టిడిపి పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news