తెలంగాణలో అనూహ్యంగా పుంజుకుంటున్న బీజేపీలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అందరూ కలిసికట్టుగా పనిచేసి…అధికార టీఆర్ఎస్‌ని గద్దె దించాల్సిన సమయంలో…ఆధిపత్య పోరుతో టీఆర్‌ఎస్‌కు ఛాన్స్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్‌కు ధీటైన పార్టీ బీజేపీ మాత్రమే. కాంగ్రెస్‌లో ఉన్న లుకలుకలు వల్ల..ఆ పార్టీ పుంజుకోలేకపోతుంది. కానీ ఇప్పుడు బీజేపీలో కూడా లుకలుకలు మొదలవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతుంది.
కానీ ఈటల హవా ఎక్కువైపోతుందని అనుకుంటున్నారో లేక…ఆయనకు లీడ్ ఇవ్వకూడదని అనుకుంటున్నారో తెలియదు గానీ…కరీంనగర్‌లో బీజేపీ వైపు చూసిన మాజీ మేయర్ రవీందర్ సింగ్‌ని చేజాతుల జారవిడుచుకున్నారు. ఇటీవల స్థానిక కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవీందర్ టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి రెబల్‌గా పోటీ చేసిన విషయం తెలిసిందే. రవీందర్‌కు ఈటల మద్ధతు ఇచ్చారు. దీంతో గెలవకపోయినా…కనీసం మంచిగా ఓట్లు తెచ్చుకున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలయ్యాక రవీందర్ బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది.
కానీ అధ్యక్షుడు బండి సంజయ్…రవీందర్ విషయం ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిసింది. దీంతో రవీందర్ మళ్ళీ కేసీఆర్‌ని కలిశారు. మళ్ళీ టీఆర్ఎస్‌లోకి వెళ్ళి ఆ పార్టీలో పనిచేయడానికి రెడీ అయ్యారు. అంటే పార్టీలోకి వచ్చే నాయకుడుని కూడా బీజేపీ చేజాతుల వదులుకుంది. కరీంనగర్ సిటీలో రవీందర్‌కు మంచి పట్టు ఉంది. మరి అలాంటి నేతని బీజేపీ చేర్చుకోలేదు. అంటే ఈటల మనిషి అని చేర్చుకోలేదో? ఏమో అని డౌట్ ఈటల అనుచరులకు వస్తుంది. మొత్తానికైతే ఈటల లీడ్ కాస్త తగ్గించడానికే చూస్తున్నట్లు కనిపిస్తోంది.