1270కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. 10 ముఖ్యమైన అంశాలు

-

దేశంలో 23 రాష్ట్రాలకు ఒమిక్రాన్ వేరియంట్ పాకింది. ఇప్పటివరకు కొవిడ్-19 కొత్త వేరియంట్‌ బారిన 1,270 మంది పడ్డారు. అతి వేగంగా వ్యాపించే గుణం ఒమిక్రాన్ వేరియంట్ కలిగి ఉన్న వైద్య నిపుణుల అంచనాల నేపథ్యంలో ఆందోళనలు నెలకొన్నాయి.

గడిచిన 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదైన మహారాష్ట్రలో 450 కొత్త వేరియంట్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 120 మంది కోలుకున్నారని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో 320 కేసులు (57 మంది కోలుకున్నారు) నమోదు అయ్యాయి. గుజరాత్‌లో 97 కేసులు(42 మంది కోలుకున్నారు), రాజస్తాన్‌లో 69 కేసులు (47 మంది కోలుకున్నారు) ఉన్నాయి.

దక్షిణ భారతదేశానికి వస్తే అత్యధికంగా కేరళలో 109 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ఒక్కరు కోలుకున్నారు.

తెలంగాణలో 62 కేసులు (18 మంది కోలుకున్నారు), ఆంధ్రప్రదేశ్ 16 కేసులు(ఒక్కరు కోలుకున్నారు), తమిళనాడులో 46 కేసులు( 29 మంది కోలుకున్నారు), కర్ణాటకలో 34 కేసులు (18మంది కోలుకున్నారు) నమోదైనట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ డేటా స్పష్టం చేస్తున్నది.

నవంబర్ ఆఖరు నుంచి దేశంలో కొత్త వేరియంట్ కేసుల నమోదు కాగా, ఇప్పటివరకు 374 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో దేశంలో 16,764 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే కేసుల పెరుగుదల 24శాతం నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. దేశంలో నమోదైన మొత్తం కేసులు 3,48,38,804. యాక్టివ్ కేసుల సంఖ్య 0.26గా ఉన్నది.

అత్యధికంగా మహారాష్ట్రలో 5,368 కొత్త కేసులు నమోదు కాగా, ఇది అంతకుముందు రోజుతో పోలిస్తే 37శాతం అధికం కావడం గమనార్హం.

గత వారం రోజుల్లో రోజువారీ కేసుల నమోదు ముంబయి మహా నగరంలో ఐదు రెట్లు పెరిగింది. గత శుక్రవారం కేవలం 683 కేసులు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఢిల్లీ, గురుగ్రాం, కోల్‌కతా, బెంగళూరుల్లో రోజువారీ కేసుల పెరుగుదల అధికంగా ఉన్నది.

దాదాపు ఏడు నెలల తర్వాత దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 1000 మార్కు దాటింది. కేసుల సంఖ్య 1323కు చేరుకున్నది. అంతకుముందు రోజుతో పోలిస్తే 42శాతం అధికం కావడం గమనార్హం.

పాజిటివిటీ రేటు 1.73శాతానికి చేరుకున్నది. గడిచిన 24గంటల్లో మరణాలు చోటుచేసుకోలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version