అన్నీ చేస్తామని చెప్పడం సులువు
అన్నీ సాధిస్తామని అరవడం సులువు
అరుపు కేవలం రాజకీయం కోసం
చెప్పడం అటుంచి చేయడం చెందడం అన్నవి
పెద్దగా పట్టింపులో లేని పనులు అందుకనే..
విశాఖకు అభివృద్ధి యోగం లేదు
రాజధాని డ్రామా అయితే నడుస్తోంది ప్రస్తుతానికి
అడ్మిన్ క్యాపిటల్ అంటూ భూ పందేరం వైసీపీ నడుపుతోంది కూడా !
అన్న ఆరోపణలకు ఆధారాలున్నా .. సీఎం కొందరిని నిలువరిస్తున్నా
ఫలితం లేదు గాక లేదు………ఈ దశలో మెట్రో కూత ఎందుకు
అదొక బర్డెన్ పోనీ అలా అని మిగతా పనులపై శ్రద్ధ ఉందా ?
చెప్పలేం తేల్చలేం స్పష్టం చేసేందుకు ఆనవాళ్లు వెతకలేం కూడా !
హైద్రాబాద్ కన్నా విశాఖను మేం వేగంగా అభివృద్ధికి ఆస్కారం ఉన్న మహానగరికి కష్టాలు తప్పడం లేదు. రైలు, రోడ్డు, వాయు, సముద్ర మార్గాలలో అన్ని సౌకర్యాలూ ఉన్నా కూడా ఎందుకనో వెనుకబాటు వెక్కిరిస్తోంది. జిల్లాల పేరిట సీఎం జగన్ కొత్తగా వివాదాలు తెచ్చి విశాఖను కాస్త 3 ముక్కలు చేశారు. ఆఖరికి స్టీల్ ప్లాంట్ కూడా కొంత భాగం విశాఖ లో కొంత భాగం అనకాపల్లిలో ఉండిపోనుంది. జీవీఎంసీ పరిధిలో విశాఖ స్టీల్ ప్లాంటును ఉంచాలని విపక్షం కోరినా ఫలితం లేకపోయింది. ఇక విశాఖ ప్లాంటు అమ్మకానికి కేంద్రం చేసే ఏ ప్రయత్నాన్నీ అడ్డుకోలేకపోయిన జగన్..మెట్రో ట్రైన్ కు ప్రతిపాదనలు కూడా సరిగా పంపలేకపోయారు అని తేలిపోయింది.
విశాఖ లాంటి నగరాలకు లోకల్ ట్రైన్ కాన్సెప్టే (ఎంఎంటీఎస్) పెద్దగా వర్కౌట్ అవ్వదు అలాంటిది మెట్రో ట్రైన్ ఎందుకు అన్న వాదన కూడా ఉంది. తుని మొదలుకుని విశాఖ నగరం వరకూ వీలున్నంత మేర పాసింజర్ సర్వీసులు నడుస్తున్నాయి కనుక మెట్రో కాన్సెప్ట్ అక్కర్లేదు అన్న వాదన కూడా ఉంది. అందుకనో ఎందుకనో వైసీపీ దీనిపై మాట్లాడడం లేదు. అలా అని విశాఖ కేంద్రంగా ఉన్న రైల్వే స్టేషన్ అభివృద్ధికి అయినా నిధులు కేటాయించమని, తదనుగుణంగా పనులు చేపట్టమని అడుగుతుందా అంటే అదీ లేదు. ఏ విధంగా చూసుకున్నా సర్కారు వారి పాట విశాఖకు అనుకూలంగా లేదు.
ఈ దశలో విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చి దిద్దుతామని చెప్పే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా వేస్తున్న అడుగులేవీ సవ్యంగా లేవని తేలిపోయింది. ఎప్పటి నుంచో ఉన్న మెట్రో రైలు ను పట్టా లెక్కించేందుకు యువ ముఖ్యమంత్రి సుముఖంగా లేరు. ఆ మాటకు వస్తే విశాఖ కేంద్రంగా వచ్చే రైల్వే జోన్ ను కూడా ఆయన ఓన్ చేసుకోలేదు. టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడినంత కూడా వైసీపీ ఎంపీలు మాట్లాడ లేదు. అదేవిధంగా విశాఖకు రావాల్సిన ఫ్యాక్టరీలు కూడా ఏవీ రావడం లేదు.
పారిశ్రామికీకరణ అంటే పరవాడ కేంద్రంగా కలుషిత రసాయిన పరిశ్రమలు తప్ప ఏవీ కూడా విశాఖను పలకరించిన పాపాన పోవడం లేదు. ఆఖరికి హెడీఎఫ్సీ కాల్ సెంటర్ కూడా ఖాళీ చేసి వెళ్లిపోయింది. సిరిపురం జంక్షన్ లో చాలా ఏళ్ల పాటు నడిచిన ఈ యూనిట్ కూడా వెళ్లిపోయింది. ఇక జగన్ ఏం చేస్తున్నారు అని! ఏం చేయాలని అనుకుంటున్నారని ?
విశాఖకు మెట్రో వర్కౌట్ అయ్యేనా ?@YSRCParty @JaiTDP @BJP4Andhra
— Manalokam (@manalokamsocial) March 29, 2022
– ట్విటర్ పోల్ – మన లోకం ప్రత్యేకం