ట్విట‌ర్ పోల్ : ఆంధ్రాలో ఆప్ గెలుస్తుందా ?

-

ఒక్క అడుగు అంటూ ఛ‌త్ర‌ప‌తి సినిమాలో
ప్ర‌భాస్ మాదిరిగా ఢిల్లీ నుంచి గ‌ల్లీ దాకా
విస్తృతం అయి పెద్ద మార్పుల‌కు శ్రీ‌కారం దిద్ది
పెను సంచ‌ల‌నం అవుతున్నారు కేజ్రీ
ఆంధ్రాలో జ‌గ‌న్ కు చంద్ర‌బాబుకు ఒకే స‌మ‌యంలో
ఝ‌ల‌క్ ఇచ్చినా ఆశ్చ‌ర్యపోన‌వ‌స‌రం లేదు..
ఓ సామాన్యుడి పార్టీ ప్ర‌తినిధులు
ఇంత‌టి విజ‌యాలు ఏ విధంగా న‌మోదు చేశారు?
ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో…

చీపురు కట్ట అంటే ఎవరికైనా చీప్ గానే కనిపిస్తోంది..కొందరైతే చీపురు పట్టుకునేందుకు కూడా ఆలోచిస్తారు…ఛీ ఛీ చీపురు కట్టా అంటారు..కానీ అదే చీపురు ఇల్లుని శుభ్రం చేస్తుంది..రోడ్లని శుభ్రం చేస్తుంది…మనషులు విసిరేసిన చెత్తని శుభ్రం చేస్తుంది …చీపురుతోనే ఇల్లు శుభ్రంగా ఉంటుంది…రోడ్లు శుభ్రంగా ఉంటాయి…ఇక అదే చీపురు ఇప్పుడు దేశాన్ని శుభ్రం చేసే పనిలో ఉంది..అది కూడా అవినీతి రాజకీయాలని పూర్తిగా క్లీన్ చేసేందుకు చీపురు ముందుకొస్తుంది…మొన్నటివరకు దేశ రాజధాని ఢిల్లీకే పరిమితమైన చీపురు..ఇప్పుడు పంజాబ్ లో పాగా వేసింది…ఇక రానున్న రోజుల్లో దేశం మొత్తం కమ్మెసేలా ఉంది.

ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)..అవినీతికి వ్యతిరేకంగా,లోక్‌పాల్ బిల్లు డిమాండ్‌తో పుట్టుకొచ్చిన ఉద్యమ సంస్థ..ఏదో ఉద్యమ సంస్థ అని మిగతా రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు.ఆ తర్వాత అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలో రాజకీయ పార్టీగా అవతరించింది …ఈ క్రమంలోనే 2013లో బోటాబోటీ మెజారిటీతో,కాంగ్రెస్‌ మద్దతుతో ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకుంది.కానీ అసెంబ్లీలో లోక్‌పాల్‌ బిల్లు పాసవ్వకపోడంతో కలత చెందిన కేజ్రీవాల్‌ రాజీనామా ప్రకటించారు…అంటే 49 రోజుల్లోనే ప్రభుత్వం రద్దయింది.

ఇక తర్వాత జరిగిన 2015 ఎన్నికల్లో చీపురు గుర్తు ఢిల్లీ రాజకీయాలను మార్చేసింది..మళ్ళీ 2020లో కేజ్రీవాల్ క్రేజ్ తగ్గలేదని రుజువైంది.రెండోసారి ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం వచ్చింది. అసలు కేజ్రీవాల్ ప్రభుత్వం…దేశంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శం. అవినీతి పాలన అందించడం,ప్రజలకు అందుబాటులో ఉంటే పరిపాలకులు.ఈ విధంగా ఒక్క‌టేంటి అన్నిరకాలుగా ఆప్ పార్టీ ప్రజలకు దగ్గరైంది.ఇక ఆప్ ఢిల్లీకే పరిమితం కాలేదు..దేశంలో మార్పు తీసుకువ‌చ్చేందుకు ముందుకు కదిలింది.

ఈ క్రమంలోనే ఆప్ పంజాబ్ పై ఫోకస్ చేసింది..ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో పంజాబ్‌లో ఘన విజయం సాధించి.. సర్కారు ఏర్పాటుకు సిద్ధమవుతుంది.అంటే ఆప్ రెండో రాష్ట్రంలో కూడా పాగా వేసింది…ఇక్కడితోనే ఆప్ ఆగదు…ఇప్పుడు ఆప్‌ను దేశ వ్యాప్తంగా విస్తృతం చేసి..మరిన్ని రాష్ట్రాలను ఊడ్చేసే దిశగా కేజ్రీవాల్‌ ముందుకు సాగుతున్నారు.ఇప్పటికే తెలగాణపై ఆప్ గట్టిగానే ఫోకస్ పెట్టింది.

తెలంగాణ రాష్ట్ర ఆప్‌ వ్యవహారాల ఇన్‌చార్జి సోమ్‌నాథ్‌ భారతి సంబంధిత పార్టీ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక పంజాబ్‌ ఫార్ములాతో తమిళనాడు,కేరళలోనూ బోణీ కొట్టేందుకు కేజ్రీవాల్ సమాలోచనలు చేస్తున్నారు.మొత్తానికి రానున్న రోజుల్లో ‘ఆప్’ దేశ రాజకీయాల్లో తీవ్రమైన మార్పులు తీసుకు వ‌చ్చేందుకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇదే స‌మ‌యాన బీజేపీ, కాంగ్రెస్ లకు దీటుగా ఆప్ ఎదిగేందుకు స‌న్నాహాలు రూపొందిస్తోంది.

– పొలిటిక‌ల్ ఎఫైర్స్ – మ‌న‌లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Exit mobile version