హైదరాబాద్ లో మరో దారుణం… మైనర్ బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్లు లైంగిక దాడి

లంగర్ హౌస్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్లు లైంగికదాడి చేశారు. స్కూలుకు వెళ్లి వచ్చే క్రమంలో బాలికపై కన్నేసిన ఆటో డ్రైవర్.. ఆదివారం దుకాణానికి వెళ్లిన బాలికను ఆటో లోకి ఎక్కించుకుని లాక్కెల్లాడు. స్నేహితుడితో కలిసి ఓల్డ్ సిటీ లో నీ ఒక ఇంటికి బాలిక ను తీసుకెల్లాడు దుండగుడు. ఆ తర్వాత బాలికను కట్టేసి అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. రెండు రోజులపాటు బాలికకు నరకాన్ని చూపించారు కామాంధులు.

child rape cases
child rape cases

ఇక అమ్మాయి ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు. సిసి ఫుటేజ్ ల ద్వారా ఆటో నెంబర్ ను గుర్తించిన పోలీసులు.. ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసు లో నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు బడాబాబులు. ఇక ప్రస్తుతం బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. తనపై పలుమార్లు లైంగిక దాడి జరిగినట్లు పోలీసులకు తెలిపింది బాధితురాలు. దీంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.