ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో నేడు, రేపు విస్తారంగా వర్షాలు పడనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.. వాయువ్య బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్య భారత దేశం వైపు ప్రయాణం చేస్తోందని పేర్కొంది వాతావరణ కేంద్రం. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ, నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వీస్తున్నాయని.. ఉత్తర బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది వాతావరణ కేంద్రం.
ఇక ఇది రేపటికి మరింత బలపడి అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ కేంద్రం…దీని ఫలితంగా ఈ నెల 21, 22 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.. అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రాగల 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. ఇక అటు విజయవాడ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది..ఇవాళ ఉదయం నుండి ఏకధాటిగా వర్షం కురుస్తుంది…