ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ పై, పోలీస్ శాఖ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్స్ కి కులం, మతం ఉండవన్నారు. ఐదేళ్లలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయితే అప్పటి సీఎం మాట్లాడలేదు. అప్పులు ఎలా వారసత్వంగా వచ్చాయో.. గత ప్రభుత్వం తప్పిదాలు అలాగే వచ్చాయి. అప్పుడు చేసిన నేరాలు, అలసత్వం కూడా ఇప్పటికీ కొనసాగుతోంది.
పదే పదే మాతో చెప్పించుకోవద్దు. తప్పులు చేసిన వారిని నా బంధువు, నా రక్తమని ఎవరైనా చెబితే మడతపెట్టి కొట్టండి అని డీజీపీ, ఎస్పీ, కలెక్టర్లకు సూచించారు. హోంమంత్రిగా అనితకు కూడా చెబుతున్నా.. మంత్రిగా మీరు బాధ్యత వహించండి అని సూచించారు. తాజాగా మాజీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. అనిత హోం మంత్రి పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నేరాలను నియంత్రించలేకపోతున్న సీఎం చంద్రబాబును కూడా రాజీనామా చేయమని డిమాండ్ చేయాలని పవన్ కళ్యాణ్ కి సూచించారు రోజా.