Breaking : కుషాయిగూడలో పేలిన రెండు ఎల‌క్ట్రిక్ బైక్‌లు

-

పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ ఎలక్ట్రిక్‌ వాహనదారుల వైపు మొగ్గు చూపుతుంటే.. రోజు రోజుకు ఎలక్ట్రిక్‌ బైక్‌లు పేలుతూ వినియోగదారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే తాజాగా.. కుషాయిగూడలో రెండు ఎల‌క్ట్రిక్ బైక్‌లు పేలిపోయాయి. వాటికి చార్జింగ్ పెడుతుండ‌గా వాటిల్లో బ్యాట‌రీలు పేలిపోయాయి. సంబంధిత బైక్‌ల య‌జ‌మాని ఇంటి బ‌య‌ట చార్జింగ్ పెట్టిన‌ప్పుడు మంట‌లు ఎగ‌సిప‌డ్డాయి. ఇంటి బ‌య‌ట ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింద‌ని భావిస్తున్నారు. ఈ మంట‌లు ప‌క్క‌నే ఉన్న ఎల‌క్ట్రిక్ తీగ‌ల‌కు అంటుకోవ‌డంతో ఆ ప్రాంత‌మంతా వ్యాపించిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ స‌మాచారం తెలియ‌గానే అగ్ని మాప‌క సిబ్బంది, పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు.

మంట‌లు ఆర్పివేసేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఇటీవల వనస్థలీపురంలోనూ ఎలక్ట్రిక్‌ బైక్‌కు చార్జింగ్‌ పెడుతున్న సమయంలో పేలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఎన్జీవోస్‌ కాలనీలో నివాసం ఉంటే కోటేశ్వర్‌రావు (33) అనే వ్యక్తి ఓ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన దిచక్ర వాహనానికి ఇంట్లో చార్జింగ్‌ పెట్టాడు. అయితే.. చార్జింగ్‌ను చెక్‌ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో మంటలు బ్యాటరీ పేలింది. కోటేశ్వరశ్‌రావుకు ముఖం, చేతులు, ఛాతికి మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version