ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ప్రశాంతంగానే ఉన్నా సరే కొన్ని కొన్ని వార్తలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి. మంత్రి వర్గ విస్తరణ త్వరలో ఏపీలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే జగన్ ఎవరిని కేబినేట్ లోకి తీసుకోవాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తులు చేసి కొన్ని పేర్లను కూడా ఆయన సిద్దం చేసారు. ఈ నేపధ్యంలోనే ఏపీలో కేబినేట్ లోకి వెళ్ళే వారి మీద చర్చ జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కేబినేట్ లోకి వెళ్ళడానికి నగిరి ఎమ్మెల్యే పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే ఆమెకు కేబినేట్ లో సీటు దక్కే అవకాశాలు మాత్రం ఏ విధంగా కూడా కనపడటం లేదు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రోజాకు మంత్రి పదవి రాకుండా ఇద్దరు మంత్రులు అడ్డం పడుతున్నారు అని పరిశీలకులు అంటున్నారు. రాయలసీమకు చెందిన ఇద్దరు మంత్రులు అని అంటున్నారు.
ఆ ఇద్దరికీ కూడా రోజా మంత్రి కావడం ఏ విధంగా కూడా ఇష్టం లేదని ఆమెను అసలు కేబినేట్ లో ఉంచితే తమకు ఇబ్బంది అనే ఆవేదన వారిలో ఉంది అని సమాచారం. ఇదే సమయంలో ఆ ఇద్దరు కూడా మహిళను కేబినేట్ లోకి తీసుకుంటే మాత్రం చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీని కేబినేట్ లోకి తీసుకోవాలి అని సూచనలు కూడా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి నిజమా కాదా… జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు చూడాలి.