ఇండియాలో ఒమిక్రాన్ కల్లోలం.. మహారాష్ట్రలో మరో రెండు కేసులు నమోదు

-

ఒమిక్రాన్ వేరియంట్ మహమ్మారి ప్రపంచాన్ని కురిపిస్తోంది. దక్షిణాఫ్రికా దేశంలో పుట్టిన ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే… నలభై ఆరు దేశాలకు పాకినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే… మన ఇండియాలోనూ… ఒమైక్రాన్ మహమ్మారి కేసులు… నమోదవుతున్నాయి.

మొదట కర్ణాటక రాష్ట్రంలో రెండు ఈ కేసులు నమోదు కాగా.. క్రమంగా కొత్త వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక తాజాగా మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ మీ రెండు కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా మహారాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

” రాష్ట్రంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తి & US రిటర్న్ అయిన మరో 36 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10కి చేరుకుంది” మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.  మహారాష్ట్ర రాష్ట్రంలో నమోదైన ఈ రెండు కొత్త వేరియంట్ కేసులతో… ఇండియా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 23 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version