గోవా లో టీఎంసీ పాగా కు కీల‌క అడుగు

-

మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వం లో ని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ని దేశ వ్యాప్తం గా విస్త‌రించ‌డానికి అనేక ఎత్తుగ‌డ లు వేస్తుంది. అందులో భాగం గా త్వ‌రలో గోవా రాష్ట్రం లో జ‌రగ‌బోయే ఎన్నికల్లో భాగం గా గోవా లో పాగ వేయ‌డానికి కీల‌క అడుగు వేసింది. గోవా లో ఉన్న మ‌హారాష్ట్ర వాది గోమంత‌క్ పార్టీ (ఎంజీపీ) అనే పార్టీ తో పొత్తు పెట్టుకుంది. అంతే కాకుండా ఈ రోజు సీట్ల పంప‌కాల‌ను కూడా రెండు పార్టీలు పూర్తి చేసుకున్నాయి.

ఈ పంప‌కాల ల్లో ఎంజీపీ పార్టీ కి టీఎంసీ 12 సీట్ల ను కేటాయించింది. కాగ గోవా లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 40 ఉన్నాయి. మిగితా స్థానాల్లో టీఎంసీ పోటీ చేయనుంది. దీనికి సంబంధించిన ఒప్పందం పై గోవా టీఎంసీ ఇన్ ఛార్జీ మ‌హువా మోయిత్రా , ఎంజీపీ అధినేత దీప‌క్ దివ‌లిక‌ర్ ఇద్ద‌రు సంత‌కాలు చేశారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార పార్టీ అయిన బీజేపీ ని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఢీ కొట్ట బోతుంది. అలాగే రాష్ట్రం లో పాగా వేయాలని భావిస్తున్న టీఎంసీ కి ఇది కీల‌క అడుగు అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version