దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ ఆ రాష్ట్ర కేబినెట్‌పై పడింది. ఈ కేసులో అరెస్టయినందున దిల్లీ ప్రభుత్వంలో కీలక మంత్రి, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, మరో మంత్రి సత్యేంద్ర జైన్ రాజీనామా చేశారు. వీరి రాజీనామాలతో మంత్రివర్గంలో ఖాళీ అయిన పలు శాఖల బాధ్యతలను అప్పగించేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎంపిక చేశారు.
ఎమ్మెల్యేలు అతిషీ, సౌరభ్ భరద్వాజ్‌ల పేర్లను దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు సిఫార్సు చేస్తూ లేఖ రాశారు. వీరిద్దరిని కేబినెట్లోకి తీసుకునేందుకు సంబంధించిన ముసాయిదాను ఇవాళ ఉదయం గవర్నర్ ఆమోదం కోసం పంపినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు, మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ల రాజీనామాలను గవర్నర్ వీకే సక్సేనా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. రాజీనామాలను ఆమోదించాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేసినట్లు అధికారులు తెలిపారు.