వైరల్; రోజు రెండు పెగ్గులు తాగితే కరోనా వైరస్ రాదూ…!

-

ఆ నిజమే.. అవును అవును మీరు చదివింది నిజమే… మీకెవరు చెప్పారు అంటారా…? మీకు అవన్నీ ఎందుకు బాసూ…? మేము చెప్పింది అక్షరాలా నిజం. నమ్మకపోతే మీ ఇష్టం. ఎం చేస్తాం మేము ముందు ఇది నిజమే అనుకున్నాం మరి. అది ఎలా సాధ్యమవుతుంది… వైరస్ కి దానికి లింక్ ఏంటి గురూ…? అంటావా…? మన ఇండియాలో ఏదైనా సాధ్యమే గా అలాగే ఇది కూడా సాధ్యమైంది గురూ…

సోషల్ మీడియా పుణ్యమా అని ఏదైనా ప్రచారం బయటకు వస్తే చాలు జనం దాన్ని నిజమే అనుకుంటారు. అలాగే ఇది కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రతీ రోజు రెండు పెగ్గులు మందు మీరు తాగితే మీ ఊపిరి తిత్తులకు కరోనా సోకే అవకాశం ఉండదు అంటున్నారు. సాధారణంగా ఆల్కాహాల్ అనేది మన శరీరంలో వేడిని పెంచుతుందని అంటారు. అలాగే మీరు రోజు ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే మీ శరీరం వైరస్ ని తట్టుకుంటుంది అంటున్నారు.

కొన్ని రకాల ఆరోగ్యానికి మేలు చేసే వైరస్ లు మన శరీరంలోకి ప్రవేశించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయని అంటున్నారు. తద్వారా కరోనా వైరస్ వేడి ఉన్న చోట ఉండలేదు. అలాగే రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్లకు సోకదు అంటున్నారు. ఈ పోస్ట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. కాబట్టి మీరు కూడా అంట రోజుకి రెండు పెగ్గులు తాగండి వైరస్ బారి నుంచి తప్పించుకోండి.

వినే వాడు ఏదో అయితే సోషల్ మీడియా ఎన్ని అయినా చెప్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ ఇప్పుడు చైనాలో దాదాపు పది వేల మందికి పైగా సోకినట్టు తెలుస్తుంది. దీనితో చైనా సర్కార్ అన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసి వేసింది. ప్రత్యేక విమానాలు మినహా దేన్ని కూడా చైనా అనుమతించడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version