దేశంలో కరోనా వ్యాక్సిన్ అందు బాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా ఇండియాలో ఉన్న వైద్య సిబ్బందికి కరోన వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో 15.82 లక్షల మందికి వాక్సిన్లను అందించారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ వ్యాక్సిన్ వలన పెద్దగా ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే, గుంటూరు జీజీహెచ్ లో ఈనెల 19 వ తేదీన కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ విజయలక్ష్మి కోమాలోకి వెళ్ళింది.
వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. అయితే, బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో విజయలక్ష్మిఈ ఉదయం మృతి చెందింది. మరోపక్క తెలంగాణలోని వరంగల్ అర్బన్‌లో హెల్త్ వర్కర్ వనిత మృతి చెందింది. వ్యాక్సిన్ వల్లే చనిపోయిందంటూ బంధువుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. హెల్త్ వర్కర్ వనిత మృతి కారణం వ్యాక్సిన్ రియాక్షన్ అని వైద్యాధికారులు నిర్ధారించలేదు. ఈనెల 22న వ్యాక్సిన్ తీసుకుంది హెల్త్ వర్కర్. టీకా వేసుకున్న తర్వాతే ఆమె మృతి చెందటంతో మిగతా వర్కర్లు కూడా భయాందోళనకు గురవుతున్నారు.