రోజుకు రెండుసార్లు నిద్ర మంచిదేనా?

-

సాధారణంగా మనం రోజుకు రెండు సార్లు పడుకోవడం వల్ల మన ఆరోగ్యానికి నష్టమేమీ ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పైగా దీనివల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయని వారు తెలిపారు.
రెండో సారి నిద్రపోయేవారిలో చురుకుదనంతో పాటు క్రియేటివిటీ పెరుగుతుందన్నారు.


రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే, చాలామంది రాత్రి కోల్పోయిన నిద్రను పగటి వేళ నిద్రపోయి కవర్‌ చేస్తారు. కొందరు త్వరగా పడుకొని త్వరగా లేచి.. అదే రోజు మధ్యాహ్నం మళ్లీ నిద్రపోతారు. మరి.. ఈ అలవాటు మంచిదేనా? రోజుకు అసలు రెండుసార్లు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? తదితర అంశాలపై ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన RMIT యూనివర్శిటీ కొన్ని పరిశోధనలు చేసి, అధ్యయనంలో భాగంగా పరిశోధకులు రాత్రి నుంచి ఉదయం వరకు ఏకధాటిగా పడుకునేవారికి, రాత్రి కాసేపు నిద్రపోయి మధ్యాహ్నం మళ్లీ పడుకునేవారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకున్నారు. అవేంటో చూద్దాం.

ఎంతసేపు పడుకుంటే మంచిది?

రోజుకు రెండు సార్లు పడుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టమేమీ ఉండదని, దీనివల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. రెండో సారి నిద్రపోయేవారిలో చురుకుదనంతో పాటు క్రియేటివిటీ పెరుగుతుందన్నారు. వీరు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ఈ కారణంతోనే కొన్ని దేశాల్లో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను మధ్యాహ్నం వేళ నిద్రపుచ్చుతారు. అలాగే ఉద్యోగులకు కూడా నిద్రపోయే అవకాశం కల్పిస్తున్నారు.

చురుగ్గా ఉండాలంటే..

శరీరానికి సరపడా నిద్ర లేకపోవడం ఫలితంగా వారి శరీరం నిద్రావస్థలో ఉంటుంది. అది పనిపై ప్రభావం చూపుతుంది. దీంతో వారు చురుగ్గా ఉండలేరని వైద్యులు తెలిపారు.అప్పుడప్పుడు కాస్త కునుకు తీసేవారు.. నిద్రవస్థ లేకుండా యాక్టివ్‌గా ఉండగలుగుతున్నారని పేర్కొన్నారు. మధ్యాహ్నం వేళ నిద్రపోయేవారు తమ కుటుంబంతో కూడా చాలా చక్కగా వ్యవహరిస్తారని, నైట్‌ డ్యూటీల సమయంలో కూడా అలసట లేకుండా పనిచేయగలగుతారని వివరించారు.

ప్రతిరోజు రాత్రి నిద్ర కనీసం 8 గంటలు ఉండాలని అంటారు. రెండోసారి నిద్రపోయేవారు ఎంతసేపు నిద్రపోవాలనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే, పరిశోధకులు ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. గత పరిశోధనల ప్రకారం.. రెండోసారి కనీసం ఒక గంట నిద్రపోయినా చురుగ్గా ఉంటారు. అలాగే, రాత్రిళ్లు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయి ఉంటే, మిగతా 4 గంటలు మధ్యాహ్నం వేళల్లో పడుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. సమయానికి నిద్రపోవడం ఎప్పటికీ మంచిదే.

Read more RELATED
Recommended to you

Exit mobile version