తెలుగు హీరోల‌కు ఆ భామ‌పై మోజు పెరిగిందా..!

-

`సోహో` చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌కు టాలీవుడ్‌లో మ‌రింత క్రేజ్ పెరిగింది. సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే సాహో చిత్రంలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్ర‌ద్ధా క‌పూర్ న‌టించింది. మ‌రి కొన్ని గంట‌ల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. శ్ర‌ద్ధా గ్లామ‌ర్ ప‌రంగా వీక్ అయినా.. బాలీవుడ్‌లో టాలెంట్‌తో నెట్టుకొస్తోంది. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉంటూ స్టార్ హీరొయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.


శ్ర‌ద్ధా క‌పూర్ సాహో చిత్రంలో ప్ర‌భాస్ ప‌క్కన పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తుంది. భారీ యాక్ష‌న్ థిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌బోయే ఈ సినిమాలో శ్ర‌ద్దాతో కొన్ని గ్లామ‌ర్ లుక్స్‌, ప్ర‌భాస్‌తో రొమాన్స్ మ‌రియు గ్లామ‌ర్ యాంగిల్ చూపిస్తూ సాగ్స్ కూడా విడుద‌ల చేశారు. ఈ క్ర‌మంలోనే శ్ర‌ద్ధా రొమాంటిక్ లుక్ బాగున్నా.. గ్లామ‌ర్ యాంగిల్ మాత్రం క‌నిపించ‌లేదు. అయితే ఈ సినిమా ప‌రంగా శ్ర‌ద్ధాకు బాగా క్రేజ్ పెరిగింది. దీంతో టాలీవుడ్ హీరోలు ఆమెతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయ‌డానికి క‌న్నేసారు.

ఇప్ప‌టికే ఇద్ద‌రు స్టార్ హీరోలు ఆమెను త‌మ సినిమాల్లో పెట్టుకోవాల‌ని చూస్తున్నారు. అలాగే సాహో సినిమా హిట్ అయితే మాత్రం ఓ రేంజ్‌లో ఆమె ఫాలోంగ్ పెరిగిపోతుంది. ఆమె లుక్స్, యాక్ష‌న్‌, గ్లామ‌ర్ న‌చ్చితే మ‌రిన్ని అవ‌కాశాలు వ‌చ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. మ‌రియు శ్ర‌ద్ధా సాహో చిత్రానికి కేవ‌లం మూడు నుంచి నాలుగు కోట్లు మాత్రమే తీసుకుంద‌ని టాక్‌. ఈ క్ర‌మంలోనే  ఆమె రెమ్యూన‌రేష‌న్ కూడా టాలీవుడ్ హీరోలకు అందుబాటులోనే ఉండ‌డంతో ప్ర‌స్తుతం ఆమెపై చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version