ఏపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. గొంతులో దోశ ఇరుక్కుని రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. తపోవనానికి చెందిన కుశల్ (2) దోష తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో కుషల్ ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. తల్లిదండ్రులు బాలుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. దీంతో ఆ బాలుడి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బాలుడి తల్లి తీవ్రంగా రోదిస్తోంది. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. దీంతో వైద్యులు చిన్నపిల్లలకు ఏమైనా తినిపించే సమయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే వారి ప్రాణానికే ప్రమాదం వాటిల్లుతుందని చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయని చిన్నపిల్లలు నోటిలో ఏమైనా పెట్టుకుంటే వెంటనే తీసేయాలని వైద్యులు చెబుతున్నారు. వారు ఆడుకునే సమయంలో కూడా చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.