ప్రగతి భవన్‌ వద్ద యువకుల ఆత్మహత్యాయత్నం.. హరీష్‌రావు కాన్వాయ్‌ ఆపి మరీ !

సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ వద్ద ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు. వేగంగా వస్తున్న మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కింద పడి ఆత్మహత్యాయత్నం చేశారు ఆ యువకులు. అయితే ఆ కారు డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని మరీ మరో యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు. ఆ యువకులను అన్నతమ్ములుగా గుర్తించిన పోలీసులు…
ఇద్దరిని అరెస్ట్ చేసి బేగంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

గతంలోనూ ఈ ఇద్దరిపై పలు కేసులు ఉన్నాయని.. ఈ కేసుల నేపథ్యంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారని సమాచారం. అంతే కాదు.. పేట్ బషీర్ బాగ్ లో అన్నదమ్ములు ఇద్దరు పలు భూకబ్జాలు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఒక ఇంటి ల్యాండ్ వ్యవహారంలో ఇటీవల అన్నదమ్ములపై కేసు కూడా నమోదు అయిందని సమాచారం. ఈ కేసు నేపథ్యంలో పేట్ బషీర్ బాగ్ Ci తో సహ ఇతర పోలీసులు తమను టార్చర్ పెడుతున్నారని.. అందుకే ఆత్మహత్యాయత్నం చేశామని ఆ యువకులు ఆరోపణలు చేశారు. తమను సిఎం కెసిఆర్ రక్షించాలని డిమాండ్ చేశారు.