సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఇండియా కూటమి నుంచి తప్పుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ…..’నితీశ్ ఇండియా కూటమితో కొనసాగుంటే దేశ ప్రధాని అయ్యే వారు. ప్రధాని అభ్యర్థిగా కూటమిలో ఎవరినైనా పరిగణిస్తారు. కూటమి ఏర్పడటానికి ప్రధాన కారణం అయిన నితీష్ కుమార్ వైదొలగడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తగిన చర్యలు చేపట్టాల్సింది’ అని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా ఇండియా కూటమి నుంచి తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ జోడో న్యాయు యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ తన పాదయాత్రకి రెండు రోజుల విరామం ప్రకటించి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇకపై కూటమి నుంచి ఎవరు తప్పుకోకుండా తగు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.