తన కోవిడ్ -19 వ్యాక్సిన్ సరఫరాపై భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా మెడికల్ దిగ్గజం ఫైజర్ మందుల మంగళవారం ప్రకటన చేసింది. భారత్ లో కరోనా టీకా కొరత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఈ ప్రయత్నాలు చేసినట్టు చెప్పింది. భారత్ లో అందుబాటులో ఉంచడానికి ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తామని ఆ కంపెనీ అధికారి ఒకరు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు.
సరఫరాపై ఉద్రిక్తతను తగ్గించడానికి ఫైజర్… ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు గతవారం రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ఫైజర్ మరియు మోడెర్నా వ్యాక్సిన్ సరఫరాపై కేంద్రంతో నేరుగా మాట్లాడటానికి రెడీ అయ్యాయి. ఇక రాష్ట్రాలు అయితే కరోనా వాక్సిన్ విషయంలో గ్లోబల్ టెండర్ లకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి.