ర‌ఘురామ కేసులో ఊహించ‌ని ట్విస్టు.. ఇదేం తీరు!

-

అదేంటో గానీ వైసీపీ ఎంపీ ర‌ఘురామ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వ‌స్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు కొట్టార‌నే విష‌యంపై విచార‌ణ జ‌ర‌గ్గా.. దానిపై కూడా క్లారిటీ రాలేదు. అటు ఎందుకు అరెస్టు చేశార‌న్న‌దానిపై కూడా సీఐడీ పూర్తి స్థాయిలో వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. ఇక మొత్తానికి బెయిల్ వ‌చ్చింద‌నుకుంటే.. ఇప్పుడు దీనిపై కూడా అనేక ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

వాస్త‌వానికి బెయిల్ ప్ర‌కారం ఆయ‌న ఎప్పుడో విడుద‌ల‌వ్వాలి. కానీ బెయిల్ లో సుప్రీంకోర్టు పలు కండీషన్లు పెట్టింది. అవే ర‌ఘురామ‌కు శరాఘాతంగా మారాయి. అటు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి రూల్స్ ఎటూ అర్థం కాకుండా ఉన్నాయి. దీంతో రఘురామకు శాపంగా త‌యార‌య్యాయి.

ఇక రిపోర్టు వ‌చ్చింద‌ని బెయిల్ ఇస్తామంటున్నారు పోలీసులు. అయితే ఏపీ పోలీసులు ఆస్ప‌త్రి బయటే ఉండ‌టంతో త‌న‌ను మ‌ళ్లీ ఏదైనా కేసులో తీసుకుపోతారేమో అని ర‌ఘురామ అనుమానిస్తున్నారు. దీంతో తాను పూర్తిగా కోలుకునే దాకా ఎక్క‌డికి వెళ్లనని ఎంపీ రఘురామ ఆర్మీ ఆస్పత్రి కమాండర్ కు లేఖ రాశారు. అంటే ఆలోపు పోలీసులు వెళ్లిపోతార‌ని ఆయ‌న భావిస్తున్నారు. కాగా ఎంపీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నాలుగైదు రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తామని ఆర్మీ డాక్టర్లు స్పష్టం చేశారు. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎటు పోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version