అగ్రరాజ్యంలో భారత పరువు అడ్డంగా తీసిన భారతీయుడు..!!! 

-

సమాజంలో మనం కూడా ధనవంతులం అనిపించుకోవాలనే ఆశ కొంతమందిలో అధికంగా ఉంటుంది. దాని కోసమే, ఎక్కడ చూసిన అధిక సంపాదన కోసం జనం పరుగులు పెడుతున్నారు. ఎక్కువ సంపాదించాలి, లగ్జరీ  లైఫ్ అనుభవించాలానే అత్యాశ ఎంత ఆశ ఉన్న వాస్తవ జీవితానికి తగినట్టుగా జీవనాన్ని సాగించేవారు కొంతమందే. అయితే అందుకు భిన్నంగా  అత్యాశల కారణంగా, మంచి చెడు ఆలోచన లేకుండా కొంతమంది చెడు మార్గంలో పయనిస్తూ ఉంటారు. అడ్డదారిలో వెళ్ళడం, ముందు సుఖంగానే ఉన్నా, చివరికి మాత్రం తిప్పలు తప్పవు. ఇలాంటి ఓ సంఘటనని యూఎస్ లో వాడే ఓ భారతీయ ఉబెర్ డ్రైవర్ ఎదురుకున్నాడు…. వివరాలలోకి వెళితే..

కెనడియన్ సరిహద్దు దాటి ఎవరు చట్ట విరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించ కూడదు. అలా ప్రవేసిస్తే, ప్రవేశించిన వారిపై మరియూ వారికి సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటుంది అమెరికా ప్రభుత్వం. అయితే  భారత్ కు చెందిన జస్వీందర్ సింగ్(30) అనే వ్యక్తి న్యూయార్క్ లో ఉబెర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సులువుగా సంపాదించాలనే ఆశతో  జస్వీందర్ 2019 జనవరి నుంచి మే వరకూ కెనడియన్ సరిహద్దు నుండి యూఎస్ లోకి చట్ట విరుద్ధంగా ప్రవిసించే వారికి సహాయపడి, రవాణా చేస్తున్నాడు.. ఈ క్రమంలోనే..

 

గతేడాది మే లో తాను మాట్లాడుకున్న ఇద్దరు వ్యక్తులను కెనడియన్ బోర్డర్ నుంచి పిక్ అప్ చేసుకోడానికి వెళ్తున్న సమయం లో  యూఎస్  పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసు విచారణలో ఇతను  2200 డాలర్లు(రూ. 1,56,968) ఆ ఇద్దరు వ్యక్తులను రవాణ చేసినందుకు తీసుకున్నాడని తేలింది. అయితే, గురువారం ఈ కేసు ఉటిక న్యాయస్థానికి విచారణకు రాగా, అందులో దోషిగా తేలిన జస్వీందర్ సింగ్ కు న్యాయమూర్తి డేవిడ్ హార్డ్ ఏడాది జైలు శిక్ష విధించారు. ఈ నేపధ్యంలోనే అతను దేశ భాహిష్కరణకు కూడా గురయ్యే అవకాశం ఉందని ఫెడరల్ ప్రాసిక్యూటర్ గ్రాంట్ జాక్విత్ పేర్కొన్నారు.

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version