ఇండియాకు ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్… నేటి నుంచి రెండు రోజుల పర్యటన

-

ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ నేటి ఇండియాకు రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు నేరుగా అహ్మదాబాద్ రానున్నారు. దీంతో అహ్మదాబాద్ నగరం బోరిస్ జాన్సన్ కు స్వాగతం పలికేందుకు సిద్ధం అయింది. తర్వాతి రోజు ఢిల్లీలో ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరుపనున్నారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక- సైనిక, వాణిజ్య సంబంధాల గురించి చర్చించనున్నాయి. ఇండో-పసిఫిక్ రీజియన్ పై కూడా ఇరు దేశాలు చర్చించనున్నారు. 

అయితే రక్షణ రంగంలో దేశాన్ని స్వావలంభన దిశగా నడిపించాలని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికి అనుగుణంగానే ఇండియాలో రక్షణ పరికరాలను ఉమ్మడిగా ఉత్పత్తి చేసేందుకు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి యూకే కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. రేపు ఢిల్లీలో ఇరు దేశాధినేతల మధ్య జరిగే మీటింగ్ లో పలు రకాల ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. దీంతో పాటు రష్యా- ఉక్రెయిన్ పరిణామాలు చర్చకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాను ఇండియాకు అప్పగించడంపై కూడా భారత్, యూకేను కోరే అవకాశం ఉంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version