ఉక్రెయిన్- రష్యా మధ్య యద్ధాన్ని ఆపేందుకు ప్రపంచంలోని అన్నిదేశాాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే యూరోపియన్ కూటమి, బ్రిటన్, అమెరికా, జపాన్, కెనడా వంటి దేశాలు రష్యాపై పలు ఆంక్షలు కూడా విధించాయి. ఐక్యరాజ్య సమితి యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ యుద్దం ఆపేయాలంటూ… పలుమార్లు రష్యాను కోరాడు.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అంశంపై మరోసారి యూఎన్ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. 27 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు న్యూయార్క్ లో భేటీ కానుంది. ఇండియన్ కాలమాన ప్రకారం 28 తేదీ రాత్రి 1.30 గంటలకు భేటీ జరుగనుంది.
ఇప్పటికే ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న రష్యాపై వ్యతిరేఖంగా తీర్మాణం ప్రవేశపెట్టారు. అయితే రష్యా తన వీటో అధికారంతో తీర్మాణం వీగిపోయేలా చేసింది. అత్యంత శక్తివంతమైన భద్రతా మండలిలోని 15 దేశాలు తీర్మాణానికి అనుకూలంగా 11 దేశాలు ఓటేయగా… రష్యా వ్యతిరేఖంగా, భారత్, యూఏఈ, చైనా దేశాలు తటస్థంగా ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి.