యుద్ధం ముగింపునకు ఇదే ఆరంభం : జెలెన్‌స్కీ

-

ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న యుద్ధం ముగింపునకు ఇదే ఆరంభమని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. రష్యా సైనికుల నుంచి విముక్తి పొందిన ఖేర్సన్‌ నగరంలో  సోమవారం పర్యటించారు. ఉక్రెయిన్‌ దళాల ధైర్యసాహసాలను కొనియాడారు

ఖేర్సన్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఇటీవల రష్యా సైన్యం కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఖేర్సన్‌కు విముక్తి లభించింది. తొమ్మిది నెలల పాటు సాగుతున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు లభించిన విజయాల్లో ఇదే కీలకం. ఈ నగరంలో పర్యటించిన జెలెన్‌స్కీ.. ఉక్రెయిన్‌ సేనలను ప్రశంసించారు.

‘‘రష్యా దాడుల్లో ఖేర్సన్‌లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో క్లిష్ట సవాళ్లు ఎదురైనప్పటికీ.. మన బలమైన సైన్యం ఈ ప్రాంతానికి శత్రువుల నుంచి తిరిగి దక్కించుకోగలిగింది’’ అని జెలెన్ స్కీ అన్నారు. క్రెమ్లిన్‌ దళాల నుంచి ఉక్రెయిన్‌ ఆర్మీ ఇప్పటివరకు మూడు అతిపెద్ద ప్రాంతాలను తిరిగి దక్కించుకోగలిగింది. ఉత్తర కీవ్‌తో, ఈశాన్య ఖర్కీవ్‌, ఖేర్సన్‌ ప్రాంతాలు ఇప్పుడు తిరిగి కీవ్‌ సేనల అధీనంలోకి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version