ఆపరేషన్ గంగా: 75 విమానాలు 18 వేల భారతీయులు.. ఉక్రెయిన్ నుంచి ఇండియాకు

-

రష్యా- ఉక్రెయిన్ వార్ కారణంగా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి ‘ ఆపరేషన్ గంగా’ ద్వారా చేర్చుతున్నారు. ఫిబ్రవరి 22న చేపట్టిన ఈ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 18000 మంది భారతీయులను స్వదేశానికి చేర్చారు. ఈరోజు రెండు స్పెషల్ ప్లైట్ల ద్వారా 410 మందిని ఇండియాకు సురక్షితంగా చేర్చారు. 

ఆపరేషన్ గంగా ప్రారంభమైనప్పటి నుంచి 75 ప్రత్యేక విమానాల ద్వారా 15,521 మంది భారతీయును ఇండియాకు చేర్చారు. దీనితో పాటు ఇండియన్ ఏయిర్ ఫోర్స్ సీ 17 విమానాల ద్వారా మరో 2467 మందిని ఇండియాకు తీసుకువచ్చారు. ఇదే సమయంలో మానవతాసాయం కింద ఐఏఎఫ్ విమానాల ద్వారా 32 టన్నుల రిలీఫ్ మెటీరియన్ ను కూడా తీసుకెళ్లిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

పోలాండ్, రోమేనియా, హంగేరీ, స్లోవేకియాల ద్వారా భారతీయులను ఏయిర్ లిఫ్ట్ చేశారు. ఇందులో బుకారెస్ట్ నుంచి 21 విమానాల ద్వారా 4575 మందిని, సుసేవా నుంచి 9 విమానాల ద్వారా 1820 మందిని, 28 విమానాల ద్వారా బుడాపెస్ట్ నుంచి 5571 మందిని, 5 విమానాల ద్వారా కోసిస్ నుంచి 909 మందిని, 11 విమానాల ద్వారా రెస్జో నుంచి 2404 మందిని, కీవ్ నుంచి 242 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version