రష్యాతో మధ్యవర్తిత్వం చేయండి… ఇజ్రాయిల్ ను కోరిన ఉక్రెయిన్

-

ఉక్రెయిన్- రష్యా యుద్ధం భీకరంగా సాగుతోంది.  పదిరోజులు గడిచినా… ఇరు దేశాలు కూడా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఉక్రెయిన్ లోని పలు ప్రధాన నగరాలు నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఇప్పటికే అందమైన నగరాలుగా పేరున్న కీవ్, ఖార్కీవ్ నగరాలు బాంబు, క్షిపణులు దాడితో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే బెలారస్ వేదికగా రెండు దఫాలుగా చర్చలు జరిగినా.. రేపు మరోసారి మూడో విడతగా చర్చలు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే రెండు దేశాలు కూడా తమ తమ డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు.

ఇదిలా ఉంటే రష్యా యుద్ధం ఆపేలా మధ్యవర్తిత్వం చేయాలని ఉక్రెయిన్ ఇజ్రాయిల్ దేశాన్ని కోరింది. ఇరు దేశాలతో ఇజ్రాయిల్ కు మంచి సంబంధాలు ఉండటంతో మధ్యవర్తిత్వం వహించాలని ఉక్రెయిన్ కోరింది. తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్.. రష్యాలో పర్యటిస్తున్నాడు. సంక్షోభ సమయంలో రష్యాలో పర్యటిస్తుండటం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో రెండున్నర గంటలు మాస్కోలో సమావేశం అయ్యారు నఫ్తాలీ బెన్నెట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version