ఉక్రెయిన్ పై ఓటింగ్ కు దూరంగా భారత్… మరోసారి తటస్థ వైఖరి

-

రష్యా, ఉక్రెయిన్ మధ్య  యుద్ధం ప్రారంభం అయి దాదాపు నెలరోజులు కావస్తోంది. అయినా యుద్ధ తీవ్రత తగ్గడం లేదు. రష్యా, ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతోంది. క్షిపణులతో దాడులు చేస్తోంది. దీంతో నగరాలన్నీ మసిదిబ్బలుగా మారుతున్నాయి. ఐక్యరాజ్య సమితిలో ఉక్రెయిన్ కు మద్దతుగా పలు దేశాలు రష్యాకు వ్యతిరేఖంగా తీర్మాణాలు చేసిన రష్యా తీరులో మార్పు రావడం లేదు. తాజాగా ఉక్రెయిన్ కు మద్దతుగా దాని మిత్ర దేశాలు తీర్మాణాన్ని ప్రవేశపెట్టాయి. ఉక్రెయిన్ లో మానవతా సంక్షోభం, రష్యా దురాక్రమణకు వ్యతిరేఖంగా తీర్మాణం చేశాయి. 

తాజాగా ప్రవేశపెట్టిన తీర్మాణంపై ఓటింగ్ కు మరోసారి దూరంగా ఉంది ఇండియా. తన తటస్థ వైఖరిలో మార్పు లేదని మరోసారి స్పష్టం చేసింది. యూఎన్ఓలో జరిగిన ఓటింగ్ లో రష్యాకు వ్యతిరేఖంగా ప్రవేశపెట్టిన తీర్మాణానికి మద్దతుగా 140 దేశాలు ఓటింగ్ వేయగా… రష్యాకు మద్దతుగా 5 దేశాలు ఓటేశాయి. భారత్ తో సహా 38 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version