Breaking news: ఉక్రెయిన్- రష్యా శాంతి చర్చలు విఫలం

-

ఉక్రెయిన్- రష్యా మధ్య చర్చలు విఫలంగా ముగిసినట్లు తెలిసింది. ఉక్రెయిన్, రష్యాల మధ్య బెలారస్ లో చర్చలు జరుగుతున్నాయి. దాదాపు 4 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. అయితే రెండు దేశాల తమతమ డిమాండ్లపై పట్టుపట్టాయి. ఉక్రెయిన్ క్రిమియా నుంచి రష్యా బలగాలు తొలిగాలని ఉక్రెయిన్ పట్టుపట్టింది. దీంతో పాటు కాల్పుల విరమణ పాటించాలని, బలగాలను వెనక్కి తీసుకోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. మరోవైపు ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకూడదని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని రష్యా డిమాండ్ చేసింది. ఈ చర్చల కోసం ఉక్రెయిన్ నుంచి ఆరుగులు, రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు. వీటితో పాటు ఈయూలో కూడా చేకూడదని రష్యా ఒత్తడి చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఓ వైపు చర్చలు జరుగుతుంటే.. రష్యా, ఉక్రెయిన్ పై దాడులు చేస్తూనే ఉంది. అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్ ను దిగ్భందించే దిశగా రష్యా కదులుతోంది. మరోవైపు ఉక్రెయిన్ జైలులో మగ్గుతున్న సైనిక అనుభవం ఉన్న ఖైదీలను విడుదల చేసి.. రష్యాతో పోరుకు పంపే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ కు అమెరికా, యూరోపియన్ దేశాలు సైనిక పరంగా సహాయం చేస్తున్నాయి. రష్యా కూడా తన న్యూక్లియర్ దళాలను సిద్ధం చేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version