ఉక్రెయిన్-ర‌ష్యా వార్ : లీట‌ర్ పెట్రోల్ రూ.254, డీజిల్ రూ.214… ఎక్క‌డంటే?

-

ఉక్రెయిన్ పై ర‌ష్యా చేస్తున్న యుద్ధ ప్ర‌భావం ప్ర‌పంచ దేశాలపై ప‌డుతుంది. కాగ ఈ దేశాల నుంచి చమురు ఉత్ప‌త్తులు దిగుతులు చాలా దేశాలు చేసుకుంటాయి. కాగ ప్ర‌స్తుతం యుద్ధం కార‌ణంగా చమురు ఉత్ప‌త్తులు నిలిచిపోయాయి. అలాగే ఇటీవ‌ల ర‌ష్యా చమురు ఉత్ప‌త్తుల పై అమెరికాతో పాటు బ్రిట‌న్ బ్యాన్ విధించాయి. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌మురుపై డిమాండ్ విప‌రీతంగా పెరిగిపోయింది. డిమాండ్ పెర‌గ‌డంతో ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి.

అలాగే ప్ర‌స్తుతం చ‌మురు ఉత్ప‌త్తులు కూడా త‌గ్గ‌డం, వినియోగం ఎక్కువ‌గా ఉండ‌టంతో ధ‌ర‌లు గ‌ణనీయంగా పెరుగుతున్నాయి. అయితే ఈ యుద్ధ ప్ర‌భావం.. శ్రీ‌లంక దేశంపై ఎక్కువ చూపుతుంది. తాజా గా శ్రీ‌లంక‌లో లీట‌ర్ పెట్రెల్ పై భారీ స్థాయిలో రూ.50 పెరిగింది. అలాగే లీట‌ర్ డీజిల్ పై అత్య‌ధికంగా రూ. 75 పెరిగింది.

దీంతో శ్రీ‌లంక మార్కెట్ లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 254 గా ఉంది. అలాగే డీజిల్ ధ‌ర రూ. 214 గా ఉంది. అయితే ఈ ప్ర‌భావం మ‌న దేశం పై కూడా ప‌డే అవ‌కాశం ఉంది. అతి త్వ‌ర‌లోనే దేశంలో పెట్రెల్ డిజీల్ ధ‌ర‌లు రూ. 120 దాటేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version