జంగారెడ్డి గూడెంలో విద్యార్థులు మరణాస్తే.. జగన్ సర్కార్ కనీస స్పందన లేదని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 15 మంది విద్యార్థులు చనిపోయినా.. సర్కార్ స్పందించదా.. అని ప్రశ్నించారు. విద్యార్థుల అస్వస్థతకు, మరణాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనకు కారకులు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగ రాష్ట్రంలో 15 మంది విద్యార్థులు చనిపోయినా.. ప్రభుత్వం స్పందన కరవు అయిందని అన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. అని ప్రశ్నించారు.
ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా అని అసహనం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అస్వస్థత గురి అయిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగ నంద్యాలలో ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆహారం తిని అస్వస్థతకు గురి అయ్యారు. కుళ్లిన గోడి గుడ్లు తినడం వల్ల విద్యార్థులు ఆస్పత్రి పాలు అయ్యారు.